జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో : స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ

AAP on Satyendar Jain’s massage video from jail. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న‌ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందింస్తుంది.

By Medi Samrat  Published on  19 Nov 2022 9:13 AM GMT
జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో : స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న‌ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందింస్తుంది. ఆక్యుప్రెషర్ అతని చికిత్సలో ఒక భాగమని పేర్కొంది. "శారీరక సమస్యల కారణంగా, జైలులో అన్ని రకాల చికిత్సలను కోర్టు ఆదేశించింది. ఆక్యుప్రెషర్ అనేది మందులతో పాటు అతని చికిత్సలో ఒక భాగం," అని ఆమ్ ఆద్మీ పార్టీ త‌మ నేత‌ను సమర్థించింది.

సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకున్న‌ వీడియోను బిజెపి విడుదల చేసింది. జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.

తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం.. వీడియో పాతది. ఇప్పటికే సంబంధిత అధికారులు, జైలు సిబ్బందిపై జైలు అధికారులు చర్యలు తీసుకున్నారు.

"ఆక్సిజన్ కొరత కారణంగా, సత్యేందర్ జైన్ నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నారు" అని పార్టీ పేర్కొంది, సత్యేంద్ర జైన్ ఆరోగ్యం చాలాసార్లు క్షీణించింది, ఆ తర్వాత కోర్టు చికిత్సను ఆదేశించింది. జైన్‌కు నరాల సమస్య ఉందని, దానికి చికిత్స నిమితం ఆక్యుప్రెషర్ థెరపీని చేయించుకున్న‌ట్లు పార్టీ వివరించింది.

సత్యేందర్ జైన్ గత నాలుగు నెలలుగా ఆహారం తీసుకోలేదని, దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ పేర్కొంది. "ఆయన గుడికి వెళ్లకుండా ఆహ‌రం తీసుకోరు.. అందుకే గత 4 నెలలుగా కేవలం పండ్లతోనే బతుకుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోర్టు చికిత్స అందించాలని ఆదేశించింది. ఇందులో ఆక్యుప్రెషర్ మసాజ్‌లు కూడా ఉన్నాయి" అని పార్టీ తెలిపింది.

16 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణంలో సత్యేందర్ జైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్నారు. సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనమ్ జైన్, అజిత్ ప్రసాద్ జైన్, ఆయన కుమారుడు వైభవ్‌, సునీల్ కుమార్ జైన్, అతని కుమారుడు అంకుష్‌పై అవినీతి నిరోధక చట్టం కింద 2017 ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించి మే 30న జైన్‌ను అరెస్టు చేసింది.



Next Story