ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం లాక్మే ఫ్యాషన్ షోలో షోస్టాపర్‌గా మారారు. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు అపరశక్తి ఖురానాతో కలిసి డిజైనర్ పవన్ సచ్‌దేవా కోసం ర్యాంప్ వాక్ చేశారు. తన ర్యాంప్ వాక్ అరంగేట్రంలో రాఘవ్ చద్దా హై-నెక్ స్వెట్‌షర్ట్, ఆరెంజ్ బెల్ట్, నలుపు రంగు లెదర్ జాకెట్‌ను ధరించారు. ఆప్ నాయకుడు ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాఘవ్ చద్దా కూడా అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
"Walked the ramp at Lakme Fashion Week 2022 for my maternal uncle (Mama), fashion designer Pawan Sachdeva," అంటూ పోస్టు చేశారు రాఘవ్ చద్దా. ఆప్ అగ్రనేతల్లో ఒకరైన చద్దా ఇటీవలే రాజ్యసభ ఉపఎన్నికలకు పార్టీ నామినేట్ చేసింది. చద్దాతో పాటు మరో నలుగురు ఆప్ నామినీలు గురువారం ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు ఐదుగురు నామినీలను ప్రకటించింది, ఇందులో అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ మరియు సంజీవ్ అరోరా ఉన్నారు. 33 సంవత్సరాల వయస్సులో, రాఘవ్ చద్దా అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ సభ్యుడు అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పంజాబ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలలో 117 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 92 స్థానాలను కైవసం చేసుకుని అఖండ విజయంతో ఆప్ అధికారంలోకి వచ్చింది.