ఇండియా కూటమికి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అక్కడ మద్దతు..!

ఇండియా కూటమికి ఓ గుడ్ న్యూస్. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీ, హర్యానా, గుజరాత్, చండీగఢ్, గోవాలలో సీట్ల సర్దుబాటుకు

By Medi Samrat  Published on  24 Feb 2024 11:45 AM GMT
ఇండియా కూటమికి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అక్కడ మద్దతు..!

ఇండియా కూటమికి ఓ గుడ్ న్యూస్. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీ, హర్యానా, గుజరాత్, చండీగఢ్, గోవాలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆప్, కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చాయి.

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ, ఆప్ ఢిల్లీలోని మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలలో పోటీ చేయనుంది. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మిగిలిన మూడు స్థానాలైన నార్త్ ఈస్ట్, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్‌లో పోటీ చేయనుంది. గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్ స్థానాల్లో కూడా ఆప్ పోటీ చేయనుంది. ఒప్పందం ప్రకారం చండీగఢ్, దక్షిణ గోవా స్థానాలను ఆప్ కాంగ్రెస్‌కు ఇచ్చింది.

గుజరాత్‌లోని 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుండగా, భావ్‌నగర్, భరూచ్ నియోజకవర్గాల్లో ఆప్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చండీగఢ్‌లో, గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగనుంది. అక్కడ ఆప్ మద్దతు ఇవ్వనుంది. ఇక పంజాబ్‌లో సీట్ల పంపకాల ఒప్పందం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అధికార ఆప్ అక్కడ ఉన్న 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని గతంలో పేర్కొంది. ఆప్, కాంగ్రెస్ రెండూ తమ తమ గుర్తుల్లో పోటీ చేస్తాయని, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని వాస్నిక్ వివరించారు.

Next Story