Video: బిహార్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..పార్టీల జెండా కర్రలతో దాడులు

పాట్నాలోని కాంగ్రెస్‌ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఆందోళన హింసాత్మకంగా మారింది.

By Knakam Karthik
Published on : 29 Aug 2025 3:42 PM IST

National News, Bihar, Patna, Congress, Bjp, Clash,  BJP and Congress workers

Video: బిహార్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..పార్టీల జెండా కర్రలతో దాడులు

బిహార్ శాసనసభ ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఒక కాంగ్రెస్‌ కార్యకర్త ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన అసభ్య వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆగస్టు 29వ తేదీ శుక్రవారం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆందోళనలకు పిలుపునిచ్చింది. పాట్నాలోని కాంగ్రెస్‌ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసన ఆందోళన హింసాత్మకంగా మారింది. బీజేపీ నిరసనకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు పార్టీ జెండాలు ఉన్న క‌ర్రల‌తో దాడి చేసుకున్నారు. ఓ ద‌శ‌లో కాంగ్రెస్ కార్యాల‌యం వ‌ద్ద కూడా దాడి జ‌రిగింది. కాంగ్రెస్‌కు గ‌ట్టి బ‌దులిస్తామ‌ని బీజేపీ నేత నితిన్ నాబిన్ అన్నారు. త‌ల్లిని దూషించిన కాంగ్రెస్ పార్టీకి బీహారీలు గుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు. దీనికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. నితీశ్ కుమార్ పాల‌న స‌రిగా లేద‌ని, ఇదంతా ప్ర‌భుత్వ జోక్యంతోనే జ‌రుగుతోంద‌ని కాంగ్రెస్ నేత డాక్ట‌ర్ ఆశుతోష్ ఆరోపించారు.

Next Story