పాఠశాలలో బిస్కెట్లు తిని.. 80 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు

జిల్లా కౌన్సిల్ పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు తిని ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు.

By అంజి  Published on  18 Aug 2024 2:15 PM IST
students, hospitalised ,biscuits, Maharashtra, school

పాఠశాలలో బిస్కెట్లు తిని.. 80 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఓ జిల్లా కౌన్సిల్ పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులు పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు తిని ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు. కేకేట్ జల్గావ్ గ్రామంలోని పాఠశాలలో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బిస్కెట్లు తిన్న తర్వాత పిల్లలకు వికారం, వాంతులు వచ్చినట్లు స్థానిక అధికారి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, ఇతర అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

విద్యార్థులను గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ ఘూఘే మాట్లాడుతూ.. ''శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బిస్కెట్లు తిన్న 257 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని తెలిపారు. వారిలో 153 మందిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరికి చికిత్స అందించి ఇంటికి పంపించాం'' అని తెలిపారు. అయితే, తీవ్రమైన లక్షణాలను కలిగి ఉన్న ఏడుగురు విద్యార్థులను తదుపరి చికిత్స కోసం ఛత్రపతి శంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఘూఘే తెలిపారు.

పాఠశాలలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలపై విచారణ జరుగుతోంది.

Next Story