భారీ ఉగ్ర కుట్ర భ‌గ్నం.. 8 మంది అరెస్టు

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారీ ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 2:00 PM IST

భారీ ఉగ్ర కుట్ర భ‌గ్నం.. 8 మంది అరెస్టు

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారీ ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఉగ్రవాద నెట్‌వర్క్ సూచనల మేరకు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్న తమిళనాడుకు చెందిన ఆరుగురు అనుమానితులను భద్రతా సంస్థలు జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేశాయి. అలాగే బెంగాల్‌లో కూడా ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు నుంచి అరెస్టయిన ఆరుగురు అనుమానితులను ఢిల్లీకి తీసుకొచ్చి విచారిస్తున్నారు. దర్యాప్తు సంస్థ ప్రకారం.. అరెస్టయిన నిందితులలో నకిలీ పత్రాలతో భారతదేశంలో చురుకుగా ఉన్న బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థాగత మాడ్యూళ్లను రూపొందించి భారీ ఉగ్రవాద ఘటనలకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దాడిలో దర్యాప్తు సంస్థలు.. వారి నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, అనేక సిమ్ కార్డులు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి.

నివేదికలను ప్ర‌కారం.. నిందితులు ఈ పరికరాల ద్వారా తమ విదేశీ మాస్టర్స్‌తో టచ్‌లో ఉన్నారు. దర్యాప్తు సంస్థలు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా దర్యాప్తు ప్రారంభించాయి.. తద్వారా వారి పరిచయాలను కనుగొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇందులో స్థానికులెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. విచారణలో చాలా ముఖ్యమైన ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా ఇంకా చాలా మందిని అరెస్టు చేయవచ్చని తెలుస్తుంది.

Next Story