ఒక్కో ఆప్‌ ఎమ్మెల్యేకు బీజేపీ 25 కోట్లు ఇస్తామని ఆఫ‌ర్ ఇచ్చింది : కేజ్రీవాల్

ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిందని, పార్టీ మారితే వారికి రూ.25 కోట్లు ఇస్తామని

By Medi Samrat  Published on  27 Jan 2024 5:30 PM IST
ఒక్కో ఆప్‌ ఎమ్మెల్యేకు బీజేపీ 25 కోట్లు ఇస్తామని ఆఫ‌ర్ ఇచ్చింది : కేజ్రీవాల్

ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిందని, పార్టీ మారితే వారికి రూ.25 కోట్లు ఇస్తామనిఆఫర్ ఇచ్చారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిందని ఆయన తెలిపారు. బీజేపీ నాయకుడి కాల్ ను రికార్డ్ చేశామని ఆప్ చెబుతోంది.

పార్టీ మారితే రూ.25 కోట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని అన్నారు. ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. 25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండని తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ కేసులో దర్యాప్తు చేయడం లేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇలాంటి కుట్రలు చాలానే జరిగాయని, కానీ అవేమీ సాధ్యపడలేదని అన్నారు. నకిలీ మద్యం కుంభకోణం సాకుతో అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారని కేజ్రీవాల్ తెలిపారు.

Next Story