ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

6 killed in accident at Agra-Lucknow Expressway. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే..

By Medi Samrat  Published on  13 Feb 2021 5:10 AM GMT
ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే.. శ‌నివారం‌ తెల్లవారుజామున కన్నౌజ్‌ సమీపంలోని తాల్‌గ్రామ్‌ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

మృతులంతా లక్నో పరిధిలోని కకోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధౌలియా గ్రామం నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనం కోసం వెళుతోంది. వారు ప్ర‌యాణిస్తున్న కారు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా తాల్‌గ్రామ్ చేరుకునేంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.


Next Story
Share it