బీహార్‌లోని సరన్ జిల్లా ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో ఆదివారం బాణాసంచా వ్యాపారి ఇంటిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు మరణించారు. వ్యాపారి షబీర్ హుస్సేన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఇంటిలోని కొంత భాగం దగ్ధం కాగా మిగిలిన భాగం మంటల్లో చిక్కుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇల్లు నది ఒడ్డున ఉంది, ఇంటి ప్రధాన భాగం కూలిపోయింది. దాదాపు ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన ఎనిమిది మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ గ్రామం జిల్లా కేంద్రమైన ఛప్రా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
"ఛప్రాలో పేలుడు కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేలుడు వెనుక కారణాన్ని పరిశీలిస్తున్నాము. ఫోరెన్సిక్ బృందం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా పిలిపించారు" అని చెప్పారు. సంతోష్ కుమార్, సరన్ ఎస్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు జరిగిన ఇంటిలో పటాకులు తయారు చేశారని, గంటపాటు పేలుళ్ల శబ్ధాలు నిరంతరం వినిపించాయని తెలిపారు.