ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పుణె సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయ్యింది. మోదీ సహా మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 54 మందిపై బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి , అడ్వకేట్ ప్రదీప్ గవాడే ఫిర్యాదు చేశారు.
మోదీతో పాటు మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృతా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ లపై ఆ 54 మంది అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు గవాడే ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సైబర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ దగదు హేక్ మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్ బేరర్ వినీత్ బాజ్‌పాయ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో 54 మందిని నిందితులుగా చేర్చినట్లు వివరించారు