మంగళవారం తెల్లవారుజామున అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. బాసర్‌లో రిచ్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం.. భూకంపం యొక్క ప్రకంపనలు 10 కి.మీ లోతును కలిగి ఉన్నాయి. తెల్లవారు జామున 4.30 గంటలకు బసర్‌కు ఉత్తర-వాయువ్యంగా 148 వద్ద భూకంపం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి పరుగులు పెట్టారు. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
ఇదిలా ఉంటే నిన్న ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌లలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 30 నిమిషాల వ్యవధిలో 3.5, 3.8 తీవ్రతతో భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 3.5 తీవ్రతతో తొలి భూకంపం తెల్లవారుజామున 2.11 గంటలకు సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రం అస్సాంలోని కాచర్ జిల్లాలో భూమికి 35 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉందని ఎన్‌సిఎస్ పేర్కొంది. మరో వైపు ఆప్ఘన్ దేశంలో సంభవించిన భూకంప ధాటికి 26 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు గాయాలు అయ్యాయి.