తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే..

41-year-old jobless Oxford graduate sues parents for lifelong financial support. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ల దుబాయ్‌కి చెందిన ఫయాజ్‌ సిద్ధిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపైనే విచిత్రమైన దావా వేశాడు

By Medi Samrat
Published on : 11 March 2021 6:22 PM IST

41-year-old jobless Oxford graduate sues parents for lifelong financial support
రోజులు మారిపోతున్నాయి. సమాజం ఎటు వైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. మనుషులు మారిపోతున్నారు. మానవత్వం అనేది మచ్చుకైన కనిపించకుండా పోతున్న రోజులు వస్తున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులపైనే కేసులు వేసే కొడుకులు ఈ రోజుల్లో ఉన్నారంటూ ఎంత దారుణ పరిస్థితి వచ్చిందో ఈ సంఘటనే నిదర్శనం. అయితే ప్రస్తుతం కాలంలో కన్నకొడుకు సరిగ్గా చూడటం లేదని, సరైన తిండి పెట్టడం లేదని ఫిర్యాదులు చేసే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్ర కనిపెంచిన తల్లిదండ్రులపైనే ఓ కొడుకు కేసు పెట్టడం ఆశ్యర్యం కలిగిస్తోంది. అవకాశం వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపైనే బతికేవాళ్లు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది. ఓ కొడుకు తన అమ్మనాన్నతలపైనే కేసు పెట్టాడు. కొడుకు ఏదో ఆనారోగ్యం, శరీర అవయవాలు సరిగ్గా పని చేయక తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదనో ఫిర్యాదు చేశాడనుకుంటే అది పొరపాటే. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ల దుబాయ్‌కి చెందిన ఫయాజ్‌ సిద్ధిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపైనే విచిత్రమైన దావా వేశాడు. తాను జీవించి ఉన్నంతకాలం తన తల్లిదండ్రులే తనకు ఆర్థిక సాయం చేయాలంటూ కుమారుడు కొర్టుకెక్కడం సంచలనంగా మారింది.


ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం భరించాలంటూ ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పుకొచ్చాడు సిద్ధిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కుల ఉల్లంఘనకు గురైనట్టేనని పేర్కొంటున్నాడు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్ధిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని చేశాడు. 2011 సంవత్సరం నుంచి ఆయన నిరుద్యోగిగా ఉన్నాడు. అంతేకాదు తనకు ఫస్ట్‌క్లాస్‌ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపైన కూడా మూడు సంవత్సరాల కిందట దావా వేసే ప్రయత్నం చేశాడు. అక్కడ టీచింగ్‌ బాగా లేదని, అది తన కెరీర్‌కు నష్టం వేసిందని సిద్ధిఖీ వాదించాడు కూడా.

మరి తల్లిదండ్రులు ఏమంటున్నారు..?

కాగా, లండన్‌లోని హైడ్‌ పార్క్‌లో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే తన ప్లాట్‌లో తన కొడుకు 20 సంవత్సరాలుగా ఎలాంటి అద్దె లేకుండా ఉంటున్నాడని సిద్ధిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్‌లు చెబుతున్నారు. అంతేకాదు సిద్ధిఖీ తల్లిదండ్రులు, తన కొడుకు ఖర్చులు భరించడమే కాకుండా ప్రతి వారం కొంత సొమ్మును ఇస్తున్నామని పేర్కొంటున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్ధిఖీకి చేస్తున్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తున్న తరుణంలో కుమారుడే వారిపై కేసు పెట్టేశాడు. అయితే తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నాడు. ఇక సిద్ధిఖీ దాఖలు చేసిన పిటిషన్‌ను గత సంవత్సరం ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు అది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది. మరి చివరికి కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో చూడాలి.


Next Story