అస్సాంలో 4.0 తీవ్రతతో భూకంపం

4.0 magnitude earthquake strikes Assam's Nagaon. అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు

By Medi Samrat
Published on : 12 Feb 2023 12:42 PM

అస్సాంలో 4.0 తీవ్రతతో భూకంపం

అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు రాష్ట్రంలోని నాగోన్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 న‌మోద‌యిన‌ట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. 12-02-2023న స‌మ‌యం నాలుగు గంట‌ల 18 నిమిషాల 17 సెక‌న్ల‌కు నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని NCS ట్వీట్ చేసింది.

ఒక రోజు ముందు.. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. సూరత్‌కు పశ్చిమాన నైరుతి (డబ్ల్యుఎస్‌డబ్ల్యు) 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం 12:52 గంటలకు నమోదైందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) అధికారి తెలిపారు. భూకంపం 5.2 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరాలో అరేబియా సముద్రంలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదు" అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.


Next Story