గుజరాత్ చరిత్రలో తొలిసారిగా నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితులపై సూరత్ పోలీసులు 10 రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. 5 రోజులలోనే శిక్షను ఖరారు చేసింది కోర్టు. ఆఖరి శ్వాస వరకూ జీవిత ఖైదు శిక్షను విధించారు. సూరత్‌లోని సచిన్ జిఐడిసి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి అక్టోబర్ 12 న నాలుగేళ్ల బాలిక అదృశ్యమైంది. సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ తోమర్ మాట్లాడుతూ ఆ సమయంలో 10 పోలీసు బృందాలు 5 గంటలపాటు వెతకగా రాంశ్వర్ కాలనీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వెనుక పొదల్లో బాలిక కనుగొనబడింది.
బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధృవీకరించారు. బాలిక ప్రైవేట్ భాగాల్లో కూడా గాయాలవ్వడాన్ని గుర్తించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అత్యాచారానికి పాల్పడిన 39 ఏళ్ల హనుమాన్ అలియాస్ అజయ్ మంగి నిషాద్‌ను అరెస్టు చేశారు. 10 రోజుల్లో పోలీసులు ఈ కేసులో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఇందులో 60 మంది ప్రత్యక్ష సాక్షులు సూరత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పిఎస్ కాలా ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.