కొవిడ్ ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

4 Dead In Fire At Covid Hospital In Nagpur. మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కొవిడ్‌ హాస్పిటల్‌లో మంటలు చెలరేగి

By Medi Samrat  Published on  10 April 2021 2:51 AM GMT
కొవిడ్ ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కొవిడ్‌ హాస్పిటల్‌లో మంటలు చెలరేగి నలుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. వివ‌రాళ్లోకెళితే.. నాగ‌పూర్ లోని వాడి ప్రాంతం ఓ ప్ర‌వేట్ ఆసుప‌త్రి రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ విభాగం‌ నుంచి మంటలు మొదలయ్యాయి. ఆ త‌ర్వాత మంట‌లు వార్డు మొత్తానికి వ్యాపించాయి. ప్ర‌మాద‌ స‌మ‌యంలో హాస్పిటల్‌లో ఉన్న 27 మంది రోగులను మరో దవాఖానకు తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

ఇక ఆ ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా.. 15 ఐసీయూ పడకలు ఉన్నాయి. మిగతా అంతస్తులకు మంట‌లు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నాగ్‌పూర్‌‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు. ప్ర‌మాదానికి కార‌ణాలు తెలియాల్సివుండ‌గా.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘ‌ట‌న‌పై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.Next Story
Share it