శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. అమ‌రులైన ముగ్గురు పోలీసులు, 14 మంది పోలీసులకు తీవ్ర గాయాలు..

3 Dead, 14 Injured In Terror Attack On Police Bus Near Srinagar. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడి జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లోని పంథా చౌక్‌ జెవాన్‌ క్యాంప్‌ వద్ద ఉగ్రవాదులకు దాడులకు దిగారు.

By అంజి  Published on  13 Dec 2021 7:25 PM IST
శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. అమ‌రులైన ముగ్గురు పోలీసులు, 14 మంది పోలీసులకు తీవ్ర గాయాలు..

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర దాడి జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లోని పంథా చౌక్‌ జెవాన్‌ క్యాంప్‌ వద్ద ఉగ్రవాదులకు దాడులకు దిగారు. పోలీసుల వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. మరో 14 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. వివిధ భద్రతా దళాలకు చెందిన అనేక శిబిరాలు ఉన్న అత్యంత సురక్షితమైన ప్రాంతంలో ఉగ్రవాదులు బస్సుపై భారీ కాల్పులకు పాల్పడ్డారు.

ఈ ఘటన ఈ రోజు సాయంత్రం పంథా చౌక్-ఖోన్‌మో రోడ్డులోని జెవాన్ ప్రాంతంలో 9వ బెటాలియన్ ఇండియన్ రిజర్వ్ పోలీస్ (IRP) వాహనంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.. గాయపడిన సిబ్బంది అందరినీ తరలించి వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతాన్ని సైనికులు చుట్టుముట్టారు. దుండగుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది. గాయపడిన నలుగురు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Next Story