2008 ముంబై ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణా అమెరికా నుంచి భారత్ కు చేరుకున్నాడు. భారత నిఘా, దర్యాప్తు అధికారుల సంయుక్త బృందంతో పాటు ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని వచ్చారు. దేశ రాజధానిలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబై 26/11 దాడులలో రాణా పాత్రపై NIA విచారణ జరపనుంది. దాడులు జరిగిన 15 సంవత్సరాల తర్వాత న్యాయం కోసం భారతదేశం చేసిన ప్రయత్నాలలో రాణాను అప్పగించడం ఒక ముఖ్యమైన దౌత్య, చట్టపరమైన పురోగతిని సూచిస్తుంది.
తహవూర్ రాణాపై ఎన్ఐఏ నమోదు చేసిన కేసును వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టులు, అప్పిలేట్ కోర్టుల్లో ఆయన వాదనలు వినిపించనున్నారు.