బంగ్లాదేశ్‌ జైలునుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు ఊరట

బంగ్లాదేశ్ ప్రభుత్వము భారతీయ మత్స్యకారులు 23 మందిని మంగళవారం బాగాహట్ జైలు నుంచి విడుదల చేసింది

By -  Knakam Karthik
Published on : 27 Jan 2026 5:21 PM IST

National News, India, Bangladesh, 23 Indian fishermen, Central Government, Visakhapatnam, Bagerhat jail

బంగ్లాదేశ్‌ జైలునుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు ఊరట

బంగ్లాదేశ్ ప్రభుత్వము భారతీయ మత్స్యకారులు 23 మందిని మంగళవారం బాగాహట్ జైలు నుంచి విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు కూడా ఉన్నారు. వీరు గత కొంతకాలంగా బాగేర్‌హట్ జైలులో ఉంటున్నారు. జైలు అధికారులు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు అప్పగించారు. ఈ సమయంలో భారత హైకమిషన్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, పోలీసులు, జిల్లా పరిపాలన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హాజరయ్యారు. కోస్ట్ గార్డు సిబ్బంది విడుదలైన మత్స్యకారులను భారీ భద్రతతో మోంగ్లా సీపోర్ట్ కు తీసుకువెళ్లారు.

గురువారం వారిని బంగ్లాదేశ్-భారత్ సముద్ర సరిహద్దు మధ్యలో ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పగించే అవకాశం ఉంది. అక్టోబర్ 2025లో ఈ మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో ఆ దేశ అధికారులు వారిని అరెస్టు చేశారు. రెండు దశల్లో ఈ మత్స్యకారులు అరెస్టయ్యారు. బంగ్లాదేశ్ నావికాదళం మొదటిసారి 14 మందిని, రెండోసారి 9 మంది మత్స్యకారులను అదపులోకి తీసుకుంది. నాటి నుంచి వీరు బాగేర్‌హట్ జైల్లో ఉన్నారు.

ప్రస్తుతానికి బంగ్లాదేశ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో సీజ్ చేసినటువంటి బోట్ల తాలూకా రిపేర్ పనులు జరుగుతున్నాయి. రేపటి కల్లా బోట్ల రిపేర్లు పూర్తిచేసి ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం 29వ తేదీ నాటికి అంతర్జాతీయ జలాల్లో బంగ్లాదేశ్ -ఇండియా కోస్ట్ గార్డ్ అధికారులు జైల్ల నుంచి విడుదల చేసిన మత్స్యకారులను భారత్ బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మత్స్యకారులను వారి వారి స్వదేశాలకు పంపించనున్నారు.

Next Story