జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నది. బార్డర్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పూంచ్‌లోని భాటా దురియన్ ఫారెస్ట్‌లో భద్రతా బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ 20 రోజుకు చేరుకుంది. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు భద్రతా బలగాలు డ్రోన్ల సాయం తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని సైతం భద్రతా బలగాలు వదిలి పెట్టడం లేదు. జమ్ముకశ్మీర్‌లో కొందరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
తాజాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని ముగ్గురు స్థానికులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అదుపులోకి తీసుకున్న వారికి సంఖ్య 20కి చేరింది. పూంచ్ జిల్లాలోని భటా ధురియన్ ఫారెస్ట్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇందులో కొందరు మహిళలు ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జేసీఓలోతో పాటు ముగ్గురు సైనికులు ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందారు. ఇద్దరు పోలీసులు, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. పశువులను మేపడానికి ఫారెస్ట్‌లోకి ప్రజలు వెళ్లడాన్ని భద్రతా బలగాలు నిషేధం విధించాయి.