గుడ్ న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.
By Medi Samrat Published on 5 Oct 2024 7:08 AM ISTప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి శనివారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. 9.4 కోట్ల మందికి పైగా రైతులు ప్రత్యక్ష బదిలీ (డిబిటి) ద్వారా రూ. 20 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను పొందుతారు. ఈ పథకంకు సంబంధించి 18వ విడత నిధులను మహారాష్ట్రలోని వాషిమ్ నుండి ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడింది. ఈ పథకంలో భూమి ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం మూడు సమాన విడతలుగా ఆరు వేల రూపాయలు అందజేస్తున్నారు. 18వ విడత సొమ్ము విడుదలైన వెంటనే మొత్తం రూ.3.45 లక్షల కోట్లకు పైగా ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి చేరనుంది.
పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద జూన్ 18న తొమ్మిది కోట్ల మూడు లక్షల మంది రైతుల ఖాతాలకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రూ.20 వేల కోట్లను జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన శివరాజ్ చౌహాన్.. గత పదేళ్లలో ఇప్పటి వరకూ 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు.
జూన్ 18న జరిగే ప్రధానమంత్రి కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రులందరికీ లేఖ రాసినట్లు కేంద్రమంత్రి చౌహాన్ తెలిపారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశంపై మంత్రివర్గంలోని అధికారులతో చర్చించి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.