కాంగ్రెస్‌ పార్టీ నుంచి 170 మంది ఎమ్మెల్యేలు జంప్‌

170 MLAs Left Congress To Join Other Parties To Contest Polls Between 2016-20. 2016-2020 మధ్య కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 170 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారని

By Medi Samrat
Published on : 11 March 2021 7:06 PM IST

170 MLAs Left Congress To Join Other Parties To Contest Polls Between 2016-20

2016-2020 మధ్య కాలంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బే తగిలినట్లు ఓ సర్వే చెబుతోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 170 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారని 'అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రెటిక్‌ రిఫార్మ్స్‌' రిపోర్టు తెలిపింది. కేవలం 18 మంది మాత్రమే బీజేపీని వీడి, ఇత పార్టీల్లో చేరారని పేర్కొంది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు జెండాలు మార్చారని నివేదిక వెల్లడించింది.

మొత్తంగా పార్టీలు మారిన వారిలో 405 మంది తిరిగి పోటీ చేయగా, 182 మంది బీజేపీలో చేరారు. 38 మంది కాంగ్రెస్‌లో చేరారు. 25 మంది తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు. అలాగే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు పార్టీని వీడారని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారని సర్వే వెల్లడించింది. 2016-20 మధ్య కాలంలో పార్టీ మారిన వారిలో 16 మంది తిరిగి రాజ్యసభకు పోటీ చేశారని, అందులో 10 మంది బీజేపీలో చేరిపోయారు. ఇక 12 మంది లోక్‌సభ ఎంపీల్లో ఐదుగురు కాంగ్రెస్‌లో చేరినట్లు సర్వే తెలిపింది.


Next Story