న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  14 Sep 2020 11:19 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.వచ్చే ఏడాది మొదట్లో కరోనా వ్యాక్సిన్‌.. వారికే ప్రాధాన్యత: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఆదివారం సోషల్ మీడియాలో ‘సండే సంవాద్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.మరింత బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 1417 కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరగా, మృతుల సంఖ్య 974కు చేరింది. రాష్ట్రంలో 30,532 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 23,639 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.9 మంది మావోయిస్టులు అరెస్ట్‌

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 9 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, జిల్లా పోలీసులు చేసిన జాయింట్‌ ఆపరేషన్‌లో వీరు చిక్కినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ వెల్లడించారు. మలివాడ, మోఖ్‌పల్‌ గ్రామాల మధ్య మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, పోలీసు బలగాలను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీలోని దిగువ స్థాయి కేడర్‌ అని ఎస్పీ వివరించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.తగ్గనున్న మాస్క్‌లు, పీపీఈ కిట్ల ధరలు

కరోనా మహమ్మారి నుంచి కాపడుకునేందుకు మాస్క్‌లు, పీపీఈ కిట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్‌ ఎంతో పెరగడంతో ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో సర్జికల్‌ మాస్క్‌ 20 నుంచి నుంచి 30 వరకు, సీపీఈ కిట్‌ రూ. 600 నుంచి 1000 వరకు, అలాగే ఎన్‌-95 మాస్క్‌లు రూ.300 నుంచి 400 వరకు అమ్మేవారు. అప్పట్లో తయారీ సంస్థలు లేకపోవడం, ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మేవారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.Fact Check : దళిత సైనికుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారా..?

తల లేకుండా ఉన్న ఓ సైనికుడి ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ సైనికుడి విగ్రహం మీద కూడా కులం అనే మచ్చ వేశారని.. అందుకే అతడి తలను విగ్రహం మీద లేకుండా చేశారని పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ సైనికుడు దళితుడు కావడంతోనే ఈ పని చేశారని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.కాళ్లు, చేతులు కట్టేసి నడి రోడ్డుపై గొంతుకోసి దారుణ హత్య..!

దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివాహేత సంబంధాలు, పగలు ప్రతీకారాలు, అత్యాచారాలు ఇలా ఎన్నో విధాలుగా ప్రతి రోజు దారుణాలు లేని రోజంటూ ఉండదు. ఇక భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి నడిరోడ్డుపై దారుణంగా హతమార్చారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని కంచన్‌బాగ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కంచన్‌బాగ్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.అమెరికాలో తెలుగు యువ‌తి దుర్మ‌ర‌ణం

సెల్ఫీ స‌ర‌దా మ‌రో ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం పాల‌య్యారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.భారత్ లో ప్రముఖులపై మహా కుట్ర…చైనా దుస్సాహసం

మనదేశంలోని అత్యంత ప్రముఖులపై చైనా నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేసిందా ? అవుననే అంటోంది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం. కథనం ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి+రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వ్యాపార దిగ్గజాలు, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్, శాస్త్రజ్ఞులు, సినీ సెలబ్రిటీలు తదితరులపై డ్రాగన్ తన నిఘా వ్యవస్ధను ఉపయోగించినందన్న కథనం సంచలనంగా మారింది. అనేక రూపాల్లో సుమారు 10 వేల మందిపై చైనా తన నిఘా వ్యవస్ధను 24 గంటలూ కన్నేసి ఉంచిందన్న విషయం బయపడింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.ప్రైవేటు స్కూల్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన హీరో

ప్రైవేటు స్కూల్‌పై మానవహక్కుల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు బిగ్‌బాస్‌ సీజ‌న్-1 విన్న‌ర్,‌ సినీ హీరో శివబాలాజీ స‌తీమ‌ణి స్వ‌ప్న మాధురి(మ‌ధుమిత‌). తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్‌లైన్ క్లాస్ నుండి తొలగించడంపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు హీరో శివబాలాజీ దంప‌తులు. ఈ మేర‌కు మౌంట్ లిటేరా జీ స్కూల్ ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ.. పిల్లలపై ఆన్లైన్ క్లాస్ ల పేరుతో అనేక సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నార‌ని ఆరోపించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story