తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  14 Sep 2020 4:03 AM GMT
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 1417 కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కు చేరగా, మృతుల సంఖ్య 974కు చేరింది. రాష్ట్రంలో 30,532 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 23,639 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.61 శాతం ఉండగా, దేశంలో 1.64 శాతం, అలాగే కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 80.1 శాతం ఉండగా, దేశంలో 77.87 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2,479 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,27,007 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 264 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరీంనగర్‌ 108, రంగారెడ్డి 133, సంగారెడ్డి 107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక మిగితా జిల్లాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story