9 మంది మావోయిస్టులు అరెస్ట్‌

By సుభాష్  Published on  14 Sep 2020 4:28 AM GMT
9 మంది మావోయిస్టులు అరెస్ట్‌

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 9 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, జిల్లా పోలీసులు చేసిన జాయింట్‌ ఆపరేషన్‌లో వీరు చిక్కినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ వెల్లడించారు. మలివాడ, మోఖ్‌పల్‌ గ్రామాల మధ్య మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, పోలీసు బలగాలను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీలోని దిగువ స్థాయి కేడర్‌ అని ఎస్పీ వివరించారు.

అరెస్టు అయిన మావోయిస్టులంతా పార్టీ అనుబంధ విభాగాలకు దండకారణ్యం ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, జన్‌మిలిషియాకు చెందిన వారిగా గుర్తించారు. భద్రతా సిబ్బందికి సంబంధించిన సమాచారం సీనియర్‌ కేడర్‌కు తెలియజేయడం, మావోయిస్టులకు సంబంధించిన పోస్టర్లను అతికించడంవల్ల పనులు వీరు నిర్వర్తిస్తుంటారని అన్నారు. ఈ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు సంచరిస్తుంటారని, వారి కోసం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Next Story
Share it