Fact Check : భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన మహిళను ఫాలో అవుతున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 2:57 PM IST
Fact Check : భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన మహిళను ఫాలో అవుతున్నారా..?

@sangramsatpath9 అనే ట్విట్టర్ ఖాతాదారుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన ఓ మహిళను అనుసరిస్తూ ఉన్నారంటూ స్క్రీన్ షాట్ లను అప్లోడ్ చేశారు.

@SaketGokhale ట్విట్టర్ ఖాతాదారుడు కూడా మోదీ అఫీషియల్ అకౌంట్ మీద కామెంట్లు చేశాడు. ఇలా ఫాలో చేయడం వలన భారత ప్రధాని మీద విమర్శలు వస్తాయని.. లేదంటే ఫేక్ ఫాలోవర్ల కోసమే ఇలా చేశారేమో అన్న అనుమానాలను వ్యక్తం చేశారు.

ట్విట్టర్ లో పలువురు మోదీ జపాన్ కు చెందిన మహిళను ఫాలో అవుతున్నారంటూ పోస్టులు పెట్టడం మొదలైంది.

నిజ నిర్ధారణ:

భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన మహిళను ఫాలో అవుతున్నారన్నది 'పచ్చి అబద్ధం'

జపాన్ కు చెందిన మహిళకు చెందినదిగా చెబుతున్న @oh5spzso అనే అకౌంట్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారన్న పోస్టు వైరల్ అవుతూ ఉండగా న్యూస్ మీటర్ ఆ ఐడీపై దృష్టి పెట్టింది. ఆ ట్విట్టర్ అకౌంట్ 'దీప్తారూప్ చక్రవర్తి' కి చెందిన అకౌంట్..! ఆయన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేయడం వలన ఆ అకౌంట్ కాస్తా జపాన్ కు చెందిన మహిళదిగా సృష్టించబడింది. ఈ విషయాన్ని దీప్తారూప్ చక్రవర్తి కూడా స్పష్టం చేశారు.

దీప్తారూప్ చక్రవర్తి తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని చెబుతూ పలు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ ఐడీ రావడానికి చాలా సమయం పట్టిందంటూ స్పష్టం చేశారు. హ్యాకింగ్ కు గురైన సమయంలో వచ్చిన పోస్టులను పట్టించుకోరాదని ఆయన అన్నారు.

దీప్తారూప్ చక్రవర్తికి టెక్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, బిజినెస్ రీసర్చ్ లో 25 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం జైకస్ టెక్నాలజీ తరపున విధులు నిర్వర్తిస్తున్న దీప్తారూప్ చక్రవర్తి గతంలో ఐబీఎం, గార్ట్నర్, క్యాప్ జెమిని, మాస్టెక్ కంపెనీలలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు.

దీప్తారూప్ చక్రవర్తికి సంబంధించిన వివరాలు పలు వెబ్ సైట్లలో ఉన్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2348 మంది ప్రముఖులను ఫాలో అవుతున్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న పలువురు భారతీయులను మోదీ అనుసరిస్తూ ఉన్నారు. వారిలో దీప్తారూప్ చక్రవర్తి కూడా ఒకరు. ఆయన అకౌంట్ హ్యాక్ అవ్వడం.. అందులో జపాన్ మహిళకు సంబంధించిన ఫోటో రావడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి.



భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన మహిళను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారన్నది పచ్చి అబద్ధం. మోదీ ఫాలో అయిన అకౌంట్ దీప్తారూప్ చక్రవర్తికి చెందినది.. ఆయన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి జపనీస్ మహిళకు చెందిన ట్విట్టర్ ఖాతాలా క్రియేట్ చేశారు.

Next Story