నిజమెంత: చోళుటెక్కా బ్రిడ్జి మహా విధ్వంసాలను తట్టుకుని నిలబడిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 2:27 PM GMT
నిజమెంత: చోళుటెక్కా బ్రిడ్జి మహా విధ్వంసాలను తట్టుకుని నిలబడిందా..?

సామాజిక మాధ్యమాల్లో ఓ బ్రిడ్జికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ఎన్ని విధ్వంసాలకైనా ఎదురొడ్డి నిలబడాలన్న దానికి సాక్ష్యం ఈ బ్రిడ్జి అని చెబుతూ ఉన్నారు. ఇంతకూ ఆ ఫోటోలో ఉన్న బ్రిడ్జి ఏమిటో తెలుసా..? చోళుటెక్కా బ్రిడ్జి..!

ఫేస్ బుక్ లో కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన పోస్టు వైరల్ అవుతోంది.

ట్విట్టర్ లో కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు.

హోండురస్ లోని చోళుటెక్కా బ్రిడ్జిని 1996లో నిర్మించారు. ఆ బ్రిడ్జికి వెళ్లే దారులన్నీ 1998లో వచ్చిన హరికేన్(భారీ గాలులతో కూడిన వర్షం)కు కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న నది కూడా తన దారిని మరల్చుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవితంలో చోళుటెక్కా బ్రిడ్జి లాగా నిలబడాలని పోస్టులు చేశారు.ఇతరులు కూడా మీకు చోళుటెక్కా బ్రిడ్జి గురించి తెలుసా..? అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిలబడాలన్నది చోళుటెక్కా బ్రిడ్జి నుండి నేర్చుకోవాలని చెబుతూ ఉన్నారు. ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా చోళుటెక్కా బ్రిడ్జిలాగా నిలదొక్కుకోవాలని పోస్టులు పెడుతూ ఉన్నారు.

న్యూస్ మీటర్ కూడా ఈ వైరల్ వార్తపై పలు విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించింది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటో దక్షిణ అమెరికా లోని హోండురస్ లో ఉన్న చోళుటెక్కా బ్రిడ్జి. భారీ హరికేన్ ను తట్టుకుని ఈ బ్రిడ్జి నిలబడింది అన్నది నిజమే..! కానీ ఆ బ్రిడ్జిని 1996లో కట్టించారన్నది అబద్దం.

చోళుటెక్కా బ్రిడ్జి అన్న ఆర్టికల్ ను ప్రకాష్ అయ్యర్ రాశారు. ‘The Bridge on the river Choluteca’ అన్నది బిడబ్ల్యూ బిజినెస్ వరల్డ్ లో పబ్లిష్ అయ్యింది. దీన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా చోళుటెక్కా బ్రిడ్జికి సంబంధించిన మరిన్ని ఫోటోలు లభించాయి. చోళుటెక్కా బ్రిడ్జికి సంబంధించిన సమాచారాన్ని కూడా పలు సంస్థలు ప్రచురించాయి.

చోళుటెక్కా బ్రిడ్జిని హోండురస్ లో కట్టించిన సస్పెన్షన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని 1930లో నిర్మించారు. 1996లో తిరిగి ఆ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జి ఎంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలదని హోండురస్ ప్రభుత్వం తెలిపింది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో ఈ బ్రిడ్జిని నిర్మించారని.. పెద్ద పెద్ద హరికేన్ లను తట్టుకుని నిలబడడం చాలా గొప్ప విషయమని చెబుతున్నారు.

1998 లో హోండురస్ ను 'హరికేన్ మిట్చ్' తాకింది. 5వ కేటగిరీలో వచ్చిన మహా విధ్వంసం. కరేబియన్ దీవులు అతలాకుతలం అయిపోయాయి. హోండురస్ కూడా హరికేన్ మిట్చ్ కు తీవ్రంగా దెబ్బతింది. బిల్డింగులు కూడా బాగా దెబ్బతిన్నాయి.. హోండురస్ లో ఉన్న మిగిలిన బ్రిడ్జిలు కూడా నాశనమయ్యాయి. కానీ చోళుటెక్కా బ్రిడ్జి మాత్రం నిలబడింది. ఎలా నిర్మించింటే అలాగే ఉండగలిగింది. చోళుటెక్కా బ్రిడ్జికి వెళ్లే దారులన్నీ కొట్టుకుపోయిన బ్రిడ్జి అలాగే నిలవగలిగింది.

బ్రిడ్జి అలాగే నిలబడగలిగింది కానీ.. కింద వెళుతున్న నది తుఫాను ధాటికి తన దారిని మార్చుకుంది. ఒకప్పుడు నది ఆ బ్రిడ్జి కింద నుండి వెళుతూ ఉండగా.. ఇప్పుడు అలా జరగడం లేదు. బ్రిడ్జి వలన ఇప్పుడు ఎటువంటి అవసరం లేకుండా పోయింది. ఈ బ్రిడ్జి గురించి పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈ బ్రిడ్జి గురించి పలువురు ఉదాహరణగా చెప్పడం మొదలుపెట్టారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ బ్రిడ్జిని ఒక ఉదాహరణగా చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకూ ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని కరోనా వైరస్ సవాలు చేసింది. మనం కూడా చోళుటెక్కా బ్రిడ్జి లాగా నిలబడాలి.. ప్రస్తుతమున్న పరిస్థితులకు అలవాటు పడాలి అని పెద్ద పెద్ద మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.

బ్రిడ్జి హరికేన్ బారిన పడకముందు.. హరికేన్ బారిన పడిన తర్వాత ఉన్న ఫోటోలను గమనించవచ్చు.

చోళుటెక్కా బ్రిడ్జి మిట్చ్ హరికేన్ ను తట్టుకుని నిలబడింది అన్నది నిజం. చోళుటెక్కా బ్రిడ్జిని 1930లలో నిర్మించారు. 1996లో బ్రిడ్జిని రీకన్స్ట్రక్షన్ చేశారు.

Next Story