ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 20 April 2020 8:03 AM IST

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్‌కు ఫోన్ చేశారు. కోవిడ్ –19 నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని, ముఖ్యమంత్రి ఈ ఫోన్ సంభాషణలో చర్చించారు. ఆంధ్రప్రధేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానికి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు.. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీకి జగన్ తెలిపారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని కూడా సీఎం.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఇదిలావుంటే.. ఏపీలో ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య 647కి చేరింది. అయితే.. అందులో 17 మంది మరణించగా.. 65మంది రికవరీ అయ్యి డిచ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రస్తుతం ఏపీలో 565 యాక్టివ్ కేసులున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
Also Read
సడలింపుల్లేవ్.. మే 7 వరకు లాక్డౌన్Next Story