నటుడు మహేష్ మంజ్రేకర్‌కు అబూ సలీం గ్యాంగ్ నుండి బెదిరింపులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 2:56 PM ISTముంబై: నటుడు, ఫిలిం మేకర్ మహేష్ మంజ్రేకర్ కు బెదిరింపు మెసేజీలు వచ్చాయి. 35 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరిస్తున్నారని, తనకు వచ్చిన మెసేజీని పోలీసులకు చూపించారు. అబూ సలీం గ్యాంగ్ కు చెందిన వ్యక్తి అంటూ మహేష్ మంజ్రేకర్ ను బెదిరించాడు. కేసును యాంటీ-ఎక్స్టార్షన్ సెల్ కు బదలాయించారు.
రెండు రోజుల కిందటే మహేష్ మంజ్రేకర్ దాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 1993 ముంబై సీరియల్ బాంబు బ్లాస్ట్ దోషి అయిన అబూ సలీం గ్యాంగ్ కు చెందిన వ్యక్తిని తానంటూ ఆ వ్యక్తి మహేష్ మంజ్రేకర్ ను బెదిరించాడు. 35కోట్ల రూపాయలు ఇవ్వాలని మెసేజీ పెట్టాడు. కేసు చాలా సెన్సిటివ్ కావడం ఎక్స్టార్షన్ కూడా ఉండడంతో యాంటీ-ఎక్స్టార్షన్ సెల్ దీనిపై దర్యాప్తు చేయడం మొదలు పెట్టింది.
మహేష్ మంజ్రేకర్ పలు బాలీవుడ్ సినిమాలతో పాటూ, తెలుగులో కూడా నటించాడు. దర్శకుడిగా కూడా నేషనల్ అవార్డులను అందుకున్నారు. వాస్తవ్, అస్తిత్వ, విరుద్ధ్ లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకుని వచ్చాయి.
ముంబై లోని చాలా మంది బడా బిజినెస్ మ్యాన్ లకు, ఫేమస్ అయిన వ్యక్తులకు పలు గ్యాంగ్ లకు చెందిన వాళ్లమని చెబుతూ వసూళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరికొందరేమో వారితో గొడవ ఎందుకు అంటూ తమకు తోచినంత ఇచ్చేసి సైడ్ అయిపోతూ ఉంటారు.