విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
By సుభాష్ Published on 18 May 2020 5:34 PM IST![విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Madhya-pradesh-Fire-accident.jpg)
అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో నలుగురు చిన్నారు కూడా ఉన్నారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్ పట్టణం రోషిణి ఘర్ రోడ్డులోని ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పెయింట్లు అంటుకుని మంటలు మరింత వ్యాపించాయి. ఈ మంటలు పక్కనున్న ఇండ్లకు కూడా మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మంటలకు ఆహుతయ్యారని గ్వాలియర్ పోలీస్ సూపరింటెండెంట్ సత్యేంద్రసిగ్ తోమర్ తెలిపారు. అయితే అగ్నికి ఆహుతైన దుకాణాలు మృతులకు చెందినవేనని తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, జగ్‌మోహన్ గోయల్, జైకిషన్, గోయల్, హరిఓమ్ గోయల్ ముగ్గురు అన్నదమ్ములు. వీరి పెయింటింగ్ షాపును కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రమాదంపై తీవ్ర దిగ్రభాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
�