ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. హుడా కాలనీ లో శ్రవణ్ (25) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న స్నేహితులే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రవణ్ ఇంటి ఎదుట ఉన్న ఓ పెళ్లి కార్యక్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్ధ రాత్రి 2:30 గంటల వరకూ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు, ఆపై స్నేహితుల మధ్య గొడవ జరగడంతో, హాకీ కర్ర, కత్తులతో దాడి చేసి శ్రవణ్ ను దారుణంగా హత మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న ఆసిఫ్ నగరర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుస్తున్నారు.

సుభాష్

.

Next Story