కీచ‌క తండ్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2020 12:52 PM GMT
కీచ‌క తండ్రి

రక్తం పంచుకొని పుట్టిన కూతురిపైనే అత్యంత దారుణంగా ప్రవర్తించాడో కీచక తండ్రి. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. సంవ‌త్స‌రం పాటు కూతురికి న‌ర‌కం చూపించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సినోడే కన్నీరు పెట్టిస్తుంటే.. ఆ మాన‌సిక విక‌లాంగురాలైన కూతురు ఎవ‌రికీ చెప్పుకోలేక బాధ‌ను పంటి కింద బిగువుప‌ట్టింది. క‌డుపు నొప్పి అని ఆస్ప‌త్రికి తీసుకెళితే.. ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది.

హ‌ర్యానాలోని పంచుకుల జిల్లాలోని సెక్టార్‌ 18 పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ వ్యక్తి.. మాన‌సిక విక‌లాంగురాలైన కూతురి(23)పై క‌న్నేశాడు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా కూతురిపై అఘాయిత్యానికి పాల్ప‌డేవాడు. యువ‌తికి ఆరోగ్యం బాగా లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ఆ యువ‌తి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ఘ‌ట‌న వివ‌రాలు ఆరా తీశారు. ఇంట్లోని కుటుంబ స‌భ్యులెవ‌రికీ ఈ విష‌యం తెలియ‌లేదు. బాలిక తండ్రిపై అనుమానం మొచ్చిన పోలీసులు త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. అస‌లు నిజం చెప్పాడు. సంవ‌త్స‌ర కాలంగా త‌న కూతురిపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపాడు. పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.

Next Story
Share it