కీచక తండ్రి
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 12:52 PM GMTరక్తం పంచుకొని పుట్టిన కూతురిపైనే అత్యంత దారుణంగా ప్రవర్తించాడో కీచక తండ్రి. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. సంవత్సరం పాటు కూతురికి నరకం చూపించాడు. కంటికి రెప్పలా కాపాడాల్సినోడే కన్నీరు పెట్టిస్తుంటే.. ఆ మానసిక వికలాంగురాలైన కూతురు ఎవరికీ చెప్పుకోలేక బాధను పంటి కింద బిగువుపట్టింది. కడుపు నొప్పి అని ఆస్పత్రికి తీసుకెళితే.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి.. మానసిక వికలాంగురాలైన కూతురి(23)పై కన్నేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. యువతికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటన వివరాలు ఆరా తీశారు. ఇంట్లోని కుటుంబ సభ్యులెవరికీ ఈ విషయం తెలియలేదు. బాలిక తండ్రిపై అనుమానం మొచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం చెప్పాడు. సంవత్సర కాలంగా తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.