Fact Check : లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ ను అరెస్టు చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Oct 2020 9:19 AM GMTసామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో భారత ఆర్మీ ఆఫీసర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ ను అరెస్టు చేశారంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆయన్ను దేశ ద్రోహం కింద అరెస్టు చేసినట్లు పలువురు పోస్టులు చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో అరెస్టు చేయడం జరిగిందంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
Indian Army's Sikh General Lt. Gen Tarn Jait Singh has been arrested on charges of sedition against the Modi government. This is a sign of the beginning of sabotage in the Indian Army@majorgauravarya @GeneralBakshi #IndianArmy #Khalistan pic.twitter.com/kj8G0sPFUO
— 𝕬𝖑𝖎 𝕽𝖆𝖟𝖆 (@AliRazaMy1) October 1, 2020
“This is a sign of the beginning of sabotage in the Indian Army. The Khalistan movement will now be further strengthened Congratulations,” అంటూ మెసేజీ వైరల్ అవుతోంది. భారత ఆర్మీలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయని.. ఖలిస్థాన్ ఉద్యమానికి ఇదొక నాంది.. మరింత ఉధృతం కాబోతోంది అంటూ మెసేజీలో ఉంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడమే ఈ అరెస్టుకు కారణం అంటూ పలువురు ట్వీట్లు చేశారు.
Indian Army's Sikh General Lt.Gen. Tarn Jait Singh has been arrested on charges of sedition against the Modi government.This is a sign of the beginning of sabotage in the Indian Army.
The Khalistan movement will now be further strengthened Congratulations✌@sherryontopp @786N1R pic.twitter.com/BvHmxS1kQu
— معـــــــاذ نــاز 🇵🇰 (@Patriotic_Naz) October 1, 2020
పాకిస్థాన్ కు చెందిన నెటిజన్లు ముఖ్యంగా లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడాన్ని గమనించవచ్చు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే అపోహను ప్రజల్లో క్రియేట్ చేయాలని భావించారు.
నిజ నిర్ధారణ:
లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ ను అరెస్టు చేశారన్నది పచ్చి అబద్ధం. ఈ కథనాలను ఆర్మీ కూడా ఖండించింది. కావాలనే చేస్తున్న దుష్ప్రచారం అంటూ వీటిని కొట్టి వేసింది.
భారత ఆర్మీ పాకిస్థాన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల్లో భారత సీనియర్ అధికారుల మీద దుష్ప్రచారం మొదలు పెట్టిందని.. ఆర్మీ సీనియర్ ఆఫీసర్లకు చెడ్డ పేరు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు.
భారత మీద అక్కసు వెళ్లగక్కడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రచారం ఇదని.. భారత ఆర్మీలో చీలికలు తీసుకుని రావడానికి పాకిస్థాన్ ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తోందని భారత ఆర్మీ ఈ దుష్ప్రచారంపై ఖండించింది.
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్) డిప్యూటీ ఛీఫ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ మీద ఎటువంటి ఆరోపణలు కూడా లేవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులపై తరన్ జిత్ సింగ్ మాట్లాడారు.. తాను ఆఫీసులో ఉండి నా పని నేను చేసుకుంటూ ఉన్నానని.. ఎటువంటి ఇబ్బందులు కూడా లేవని తేల్చి చెప్పారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.
లెఫ్టినెంట్ జనరల్ తరన్ జిత్ సింగ్ ను అరెస్టు చేశారన్నది 'పచ్చి అబద్ధం'.