Fact Check : కింద దొర్లుతూ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది రావిష్ కుమారేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2020 4:11 AM GMT
Fact Check : కింద దొర్లుతూ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది రావిష్ కుమారేనా..?

సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కింద దొర్లుతూ మరీ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది ప్రముఖ ఎన్.డి.టీ.వీ. జర్నలిస్టు రావిష్ కుమార్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఇందు తివారీ మొదట ఈ వీడియోను పోస్టు చేశారు. సెప్టెంబర్ 29, 2020న వీడియోను పోస్టు చేశారు. 'ఈ వీడియోలో ఉన్న జర్నలిస్టును గుర్తు పట్టగలరా.. ఆయన జర్నలిజం మీద తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఉన్న జర్నలిజం ఆయనకు ఒక జోక్ లా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంకెవరో కాదు రావిష్ కుమార్' అంటూ పోస్టు పెట్టారు. “Do you recognise this messiah journalist? He imparts knowledge of journalism to the world. He finds today’s journalism as a joke. He’s called Ravish Kumar” అన్నది ట్వీట్.

F1



జర్నలిస్ట్ సుశాంత్ బి సిన్హా కూడా అదే క్యాప్షన్ తో పోస్టు చేశారు. “Do you recognise this messiah journalist? Hint: He imparts knowledge of journalism to the world.” అని సుశాంత్ సిన్హా ట్వీట్ చేశారు.

F2



నిజ నిర్ధారణ:

ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

జర్నలిస్టు రావిష్ కుమార్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను వెతకగా.. వాటిలో ఎక్కడ కూడా ఆయన పడుకుని మరీ రిపోర్టింగ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు లభించలేదు. ఎన్.డి.టీ.వీ. ఇండియా ప్రకారం ఆ వీడియోలో ఉన్న జర్నలిస్టు రావిష్ కుమార్ కాదు. ఆ వీడియోలో ఉన్నది కాశ్మీరీ జర్నలిస్టు ఫయాజ్ బుఖారి.

కింద ఫోటోలో వారి ముఖాల పరంగా ఉన్న తేడాలను గమనించవచ్చు.

F3

ఈ వీడియో 2006 సంవత్సరంలో తీసినది. 2013 జూన్ లో ఎన్.డి.టీ.వీ. బ్లూపర్స్ కు సంబంధించిన వీడియోలను పోస్టు చేసింది. “NDTV Bloopers 2006: Err, rolling?” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ అవుతున్న క్లిప్ ఈ వీడియోలో ఉంది.

ఈ ఘటనకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా ఫయాజ్ బుఖారీ 2006 మే నెలలో శ్రీనగర్ లో 'కాంగ్రెస్ ర్యాలీ మీద ఫిదాయీన్ అటాక్' న్యూస్ ను కవర్ చేయడం గమనించవచ్చు. ఆ సమయంలో కాశ్మీర్ కరస్పాండెంట్ గా ఫయాజ్ బుఖారీ ఉన్నారు. ఫైరింగ్ జరుగుతున్న సమయంలోనే రిపోర్టింగ్ చేశారు. తమకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా కింద పడుకుని మరీ రిపోర్టింగ్ చేశారు. NDTV reporter Fayaz Bukhari and the cameraperson were just meters away from the gunfire అంటూ 2006 సంవత్సరం మే నెలలో ఎన్.డి.టీ.వీ. ఈ వీడియోను అప్లోడ్ చేసింది.

F4

ఈ ఘటనకు సంబంధించి అసోసియేటెడ్ ప్రెస్ కూడా వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చాలా పాతదని.. శ్రీనగర్ లో చోటు చేసుకున్న ర్యాలీకి సంబంధించిన వీడియో అని స్పష్టమవుతోంది.

F5

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : కింద దొర్లుతూ రిపోర్టింగ్ ఇస్తున్న ఆ వీడియోలో ఉన్నది రావిష్ కుమారేనా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story