తోపుడుబల్లపై గర్భిణితో 700 కి.మీ ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వలస కూలీల కష్టాలు
By సుభాష్ Published on 14 May 2020 8:18 AM GMTముఖ్యాంశాలు
లాక్‌డౌన్‌తో దిన దిన గండంగా మారిన వలస బతుకులు
తిండి లేక పస్తులుంటూ కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం
వలస కూలీల ధీనాగాథ
వారు వలస కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని చేస్తేనే పొట్టనింపుకొనేది. లేదంటే పస్తులుండాల్సిందే. చాలీ చాలని కూలీ డబ్బులతో ఒక పూట తిన్నా.. మరో పూట పస్తులుండాల్సిన దుస్థితి. అలాంటిది లాక్‌డౌన్ చావుదెబ్బకొట్టింది. బతికున్నా.. చనిపోయినా.. ఒక్కటే అన్న విధంగా మారింది వలస కూలీల బతుకులు. లాక్‌డౌన్ కారణంగా పని కూడా లేకుండా పోవడంతో తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితి దాపురించడంతో జీవన విధానం దుర్భరంగా మారింది. వెళ్దామంటే రవాణా సౌకర్యం లేక.. తినేందుకు తిండి లేక బిక్కు బిక్కుమంటూ గడిచిన రోజులవి.
ఇలా.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక వలస కార్మికుల కష్టాలను చూస్తుంటే కన్నీళ్లు రాక మానదు. లాక్‌డౌన్ కారణంగా వలస జీవులు ఎన్నో ఇబ్బందులను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మయదారి రోగం కారణంగా వలస కార్మికులపైత తీవ్ర ప్రభావం పడింది. కనీసం తింనేందుకు తిండిలేక, చేసుకునేందుకు తిండిలేక, సరైన రవాణా సౌకర్యం లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. కాళ్లు కాయలు కాస్తున్నా.. నడక మాత్రం ఆపడం లేదు వలస జీవులు. రెక్కాడితే కాని డొక్కాడని వలస జీవులు పడరాని కష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ ఘటన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించేలా ఉంది. వివరాల్లోకి వెళితే..
�
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వలస కార్మికుడు గర్భవతి అయిన తన భార్య ధన్వంత, పసిబిడ్డ అయిన కుమార్తెతో హైదరాబాద్ నుంచి స్వస్థలానికి బయలుదేరాడు.
కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన రాము అనే వలస కార్మికుడు హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తినేందుకు తిండి లేక, చేసుకునేందుకు పనులు లేక నానా అవస్థలకు గురికావడంతో చేసేదేమి లేక గర్భవతి అయిన భార్య, పిల్లలతో సహా స్వగ్రామమైన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు బయలుదేరాడు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చేసేదేమి లేక సుమారు 700 కిలోమీటర్ల దూరాన్ని ఓ తాత్కాలిక చెక్కబడిని తయారు చేసుకుని, దానిపై గర్భవతి అయిన భార్యను, కూతురిని కూర్చోబెట్టి తన ప్రయాణం సాగించాడు.
ఓ కర్ర, చెక్క ముక్కతో ఓ తోడుపు బల్లగా తయారు చేశాడు రాము. భార్య, పిల్లలతో స్వస్థలానికి బయలుదేరిన రాము.. ఎట్టకేలకు మంగళవారం జిల్లాలోని తన గ్రామానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇలాంటి కష్టాలు ఎవ్వరికి రాకూడదు..
ఇలాంటి కష్టాలు మరెవ్వరికి రాకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు వలస కూలీ రాము. అయితే ముందుగా నా కుమార్తెను మోసుకెళ్లి నడిచేందుకు ప్రయత్నించానని, కానీ నా భార్య గర్భవతి ఉండటంతో నడవడం కష్టంగా ఉంటుంది. దారిలో అడవుల్లో దొరికిన కర్రల సాయంతో తాత్కాలిక బండిని నిర్మించి, దానిపై భార్య, కూతురిని కూర్చోబెట్టి హైదరాబాద్ నుంచి బాలాఘాట్ వరకూ తోసుకుంటూ వచ్చాను. దారిలో తినడానికి తిండి కూడా దొరకలేదు. ఒక వైపు ఆకలి.. మరోవైపు నేను నడుస్తూ బండిని తోసుకుంటూ రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు.. ఇలా నా కష్టాల గురించి ఎంత చెప్పిన తక్కువే..అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. హైదరాబాద్ కు కుటుంబంతో వలస వచ్చాను. లాక్‌డౌన్ కారణంగా పనులు దొరక్క తినడానికి తిండి లేక నానా కష్టాలు పడ్డాను. ఆ కష్టాలు గుర్తుకు వస్తేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి కష్టాలు శతృవుకు కూడా రాకూడదు.. అంటూ దారిలో కలిసిన మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు.
సొంత జిల్లాలోకి ప్రవేశించగానే..
మహారాష్ట్ర గుండా సొంత జిల్లాలోకి చేరుకోగానే సబ్ డివిజన్ అధికారులు, పోలీసులు బిస్కెట్లు, ఆహారాన్ని అందించారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మేము పడుతున్న కష్టాలను చూసి మా ముగ్గురికి కూడా కొత్త చెప్పులు ఇచ్చారు. అంటూ పకరించిన మీడియా ముందు కన్నీరు కార్చాడు.
వాహనంలో సొంతూరుకు పంపించారు
హైదరాబాద్ నుంచి సొంత జిల్లాలోకి అడుగుపెట్టిన వలస కూలీ కుటుంబాన్ని గమనించిన సబ్ డివిజన్ అధికారులు, పోలీసులు గమనించి వైద్య పరీక్షలు నిర్వహించి బాలాఘాట్‌కు ఒక వాహనంతో పంపించారు. అక్కడ వారు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటారని సబ్ డివిజన్ అధికారి భార్గవ్ మీడియాకు వివరించారు.
ఏది ఏమైనా కరోనా కారణంగా సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకూ అందరిని కష్టాల్లో ముంచెత్తుతోంది. దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా ఇలాంటి వలస కూలీల కష్టాలు మరెన్నో ఉన్నాయి. ఇలా వలస కూలీల కష్టాలు చూసి బాధపడుతున్న వారు మానవత్వంలో దారిలో పోయే వలస కూలీలకు ఆహారం, నీళ్లు, ఎంతో కొంత డబ్బులు అందజేస్తున్నారు. మరి ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయే వేచి చూడాలి.