ఆక‌లి మంట‌తో రోడ్డెక్కిన వ‌ల‌స కూలీలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 5:15 AM GMT
ఆక‌లి మంట‌తో రోడ్డెక్కిన వ‌ల‌స కూలీలు

లాక్ డౌన్.. వారిని రోడ్ల పాలు చేసింది. గుక్కెడు బువ్వ దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. బతుకు దెరువుకు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సొంతూరికి వెళ్లలేక ఉన్నచోట తిండి దొరక్క ఆహారం కోసం అలమటిస్తున్నారు. ప్రతిరోజు తినడానికి ఆహారం దొరక్క ఖాళీ కడుపులతోనే పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రంలోని హెచ్‌సిఎల్ కంపెనీలో పనిచేసే వ‌ల‌స కూలీలు రోడెక్కారు. బీహార్‌, బ‌రిస్సా రాష్ట్రాల‌కు చెందిన వీరు త‌మ స్వ‌స్థలాల‌కు పంపించాల‌ని ర‌హదారిపై బైఠాయించారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌స్తులు ఉండాల్సి వ‌స్తోంద‌ని, ఒక రోజు ఆహారం దొరికానా అది స‌రిపోవ‌డం లేద‌ని సగం ఆక‌లితోనే ఉంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ తిన‌డానికి తిండి లేదు, మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకునే నాథుడే లేద‌ని వాపోయారు. కంపెనీకి చెందిన వారు ఎటువంటి స‌హాయం చేయ‌డం లేద‌ని, ఆక‌లితో చావ‌లేకే రోడెక్కాల్సి వ‌చ్చింద‌న్నారు. 8 నెల‌ల క్రితం సుమారు 300 మంది డైలీ లేబ‌ర్‌గా ప‌ని చేయ‌డానికి ఇక్క‌డికి వచ్చామ‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌లేక‌పోతున్నామ‌న్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి స్వ‌స్థ‌లాల‌కు పంపే ఏర్పాట్లు చేయాల‌ని కోరారు.

Next Story
Share it