దేశంలో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ విమాన సర్వీసులతో పాటు రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 20 నుంచి పలు రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

► ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, విక్రయాలకు అనుమతి.

► సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, స్పోర్ట్స్‌ కంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, బార్లు మూసివేత

►విద్యాసంస్థలు, ట్రైనింగ్‌ సెంటర్ల మూసివేత

► మత ప్రార్థనలు, ఆలయాలు మూసివేత

► వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ

►అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి ఉండదు

► ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథంగా, మందుల ఫ్యాక్టరీలు, పరిశోధనా కేంద్రాలు యథాతథంగా కొనసాగింపు

► పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమలు, టీ. కాపీ రబ్బరు సాగును కొనసాగించుకోవచ్చు

► ఉపాధి హామీ పనుల కొనసాగింపు

►వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి

►బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగింపు

►అక్వా ఉత్పత్తుల క్రయ విక్రయాలకు అనుమతి

►రోడ్ల పక్కనే దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి

► ఇతర ప్రాంతాలకు కూలీలను తరలించేందుకు అనుమతి

► ఈ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి

► వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు కలెక్టర్ల అనుమతి ఖచ్చితం

► ఎలక్ట్రీషియన్లు, ఐటీ మరమ్మతులు, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి

► గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి

► భవన నిర్మాణ రంగానికి నిబంధనలతో కూడిన అనుమతి

►ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం

అలాగే హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపు ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిత్యావసర వస్తువుల పంపిణీ మినహాయించి ఎలాంటి కార్యక్రమాలు ఉండవు.హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది. ఈ ప్రాంతాల్లో జోన్లను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటిస్తాయి. ఈ ఏరియాల్లో సాధారణమైన మినహాయింపులు వర్తించవు.

సుభాష్

.

Next Story