రాయపాటిని ఆ హీరోయిన్ ఎలా బెదిరించిందో తెలిస్తే షాకే.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jun 2020 3:41 PM ISTతలపండిన రాజకీయ నాయకుడు ఆయన. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులే కాదు.. ఆయనతో ముడిపడిన వివాదాలు అనేకం. ఎవరూ ఆయనతో పెట్టుకోవాలని దాదాపు అనుకోరు. అలాంటి ఆ సీనియర్ రాజకీయ నేతను బ్లాక్ మొయిల్ చేసి బిస్కెట్ వేయాలన్న ప్లాన్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు? ఆయన్ను బ్లాక్ మొయిల్ చేసే సాహసం చేసిన హీరోయిన్ ఎవరన్న విషయంలోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారందరికి సుపరిచితుడు రాయపాటి సాంబశివరావు. మాజీ ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆయన్ను బ్లాక్ మొయిల్ చేసే సాహసానికి తెర తీశారు మలయాళ సినీ హీరోయిన్ లీనా మరియా పాల్. తన ప్రియుడితో కలిసిన ఆమె.. రాయపాటిని బెదిరించి.. సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయటం విశేషం.
బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల్ని ఎగ్గొట్టిన ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు రాయపాటి. దీనికి సంబంధించి సీబీఐ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ లీనా.. ఆమె లవ్వర్ సుఖేశ్ తో పాటు మరికొందరు కలిసి ఒక ప్లాన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో లీనా అనుచరుడు నేరుగా రాయపాటి ఇంటికి వెళ్లాడు. తనను తాను సీబీఐ అధికారినంటూ కలర్ ఇచ్చాడు.
తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలే కానీ.. సీబీఐ కేసు నుంచి బయపడేస్తానని బెదిరింపుతో కూడిన ఆఫర్ ఇచ్చారు. తాను చెప్పిన డీల్ కు ఓకే చెప్పకుంటే తిప్పలు తప్పవని బ్లాక్ మొయిల్ చేశారు. ఇలాంటివెన్నో చూసిన రాయపాటికి ఎక్కడో సందేహం వచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసిన వారు.. లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.
రాయపాటి బెదిరింపుల వెనుక సినీ హీరోయిన్ లీనా ఉందన్న విసయాన్నిగుర్తించిన సీబీఐ అలెర్టు అయ్యింది. మరింత లోతుగా విచారించగా.. ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్.. ఇతర అనుచరులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారు రంగంలోకి దిగి.. లీనా అనుచరులు మణివర్దన్.. సెల్వరామరాజులను అరెస్టు చేశారు. లీనా.. ఆమె బాయ్ ఫ్రెండ్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. లీనా గతంలోనూ తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నేతను ఇదే రీతిలో బెదిరించి సొమ్ము చేసుకున్నట్లుగా గుర్తించారు. రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అమ్మడి నటనకు సీబీఐ అధికారులుసైతం అవాక్కు అవుతున్నారు.