ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 275 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 8:30 AM GMT
ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 275 పాజిటివ్‌ కేసులు

ఏపీలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 15,188 శాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 275 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,555 కి చేరింది. కొవిడ్‌ వల్ల కర్నూలులో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఈ మ‌హ‌మ్మారి వల్ల ఇప్పటి వరకు 90 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,906మంది డిశ్చార్జి కాగా.. 2559మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Untitled 5 Copy

Next Story