లాక్‌డౌన్ వేళ‌ దారుణం : మహిళా బ్యాంక్ మేనేజ‌ర్‌పై అత్యాచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 April 2020 4:53 AM GMT
లాక్‌డౌన్ వేళ‌ దారుణం : మహిళా బ్యాంక్ మేనేజ‌ర్‌పై అత్యాచారం

క‌రోనా కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యే పరిస్థితి. ప‌క్కింట్లో ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అయితే.. ఇదే అదునుగా బావించిన ఓ దుర్మార్గుడు మ‌హిళ‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో ఎవ‌రికి వారు త‌మ‌కు తోచినంత ధ‌న‌ సాయ‌మో, వ‌స్తు సాయ‌మో చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ప‌నికి పాల్ప‌డి వార్త‌ల్లో నిలిచాడు.

వివ‌రాళ్లోకెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అత్యాచారానికి గురైన బాధితురాలు(53) ఓ ప్రభుత్వ బ్యాంకు మేనేజ‌ర్. బాధితురాలికి కంటిచూపు సమస్య ఉంది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో బాధితురాలి భర్త రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో చిక్కుకున్నారు. దీంతో ఆమె గత కొన్ని రోజులుగా త‌మ ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శుక్ర‌వారం తెల్లవారుజామున దుండ‌గుడు ఈ దారుణాకి పాల్ప‌డ్డాడు. బాధితురాలి అపార్ట్‌మెంట్‌ మెట్ల ద్వారా సెకండ్ ఫ్లోర్ కు వచ్చి.. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో నేరుగా లోప‌లికి ప్రవేశించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విష‌య‌మై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story