పాతబస్తీలో యువతి కిడ్నాప్‌ యత్నం కలకలం రేపింది. తండ్రితో కలిసి బయటకు వెళ్లేందుకు యత్నించిన యువతిని కిడ్నాప్‌కు యత్నించారు కొందరు దుండగులు. అంతేకాదు తండ్రిపై బాటిల్స్‌తో దాడి చేస్తూ, కళ్లల్లో కారంపొడి చల్లారు. దీంతో యవతి తండ్రి దుండగుల దాడిని ప్రతిఘటించారు. బాధితురాలు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితుడు మహమ్మద్‌ షరీఫ్‌ మాసాబ్‌ ట్యాంక్‌ శాంతినగర్‌ కాలనీ వాసి. దుండగుడు సల్మాన్‌ మీర్జాబేగ్‌తో పాటు నలుగురు స్నేహితులు ఈ కిడ్నాప్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్‌కు యత్నించిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్‌ యత్నం దృశ్యాలు అక్కడి ప్రాంతంలో సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతిని కిడ్నాప్‌ చేసేందుకు కారణాలేమై ఉంటాయని పోలీసులు ఆరా తీస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.