సీఎం ఉద్ధవ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి కంగనా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2020 10:26 AM GMTమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు విషయమై కంగనా ఇటీవల ముంబై నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కంగనపై ఫైర్ అయ్యింది. ఇక విజయదశమి సందర్భంగా శివసేన పార్టీ దసరా వేడుకల్లో ఉద్దవ్ థాకరే కంగనాపై పరోక్షంగా విమర్శలు చేశారు.
సొంత రాష్ట్రంలో తిండికి గతిలేని వారు ముంబాయికి వచ్చి డబ్బు సంపాదించుకుని, తిన్నింటివాసాలే లెక్కపెడుతున్నారని అన్నారు. ఈ నగరాన్ని పీవోకేతో పోలుస్తూ విమర్శలు చేస్తారు. ముంబైలో ఎక్కడ చూసిన మాదకద్రవ్యాలు దొరుకుతాయని ఆరోపిస్తారు. ఇలాంటి విమర్శలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..? మా ఇళ్లలో మేము తులసి మొక్కలు మాత్రమే పెంచుతాం. గంజాయి పెంచడం మాకు తెలీదు.. గంజాయి మీ రాష్ట్రాల్లోనే దొరుకుతుందని ఆరోపించారు.
ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా మండిపడ్డారు.. హిమాలయాల సౌందర్యం భారతీయులందరికీ చెందినట్టుగానే ముంబాయి ఇచ్చే అవకాశాలు కూడా అందరికి చెందుతాయన్నారు కంగనా. ఉద్ధవ్ తనను నమ్మక ద్రోహి అని అన్నారని, ముంబై తనకు షెల్టర్ ఇవ్వకపోతే తనకు తిండి కూడా దొరకదని అన్నారని ఆమె చెప్పింది. తనకు ఉద్ధవ్ థాకరే కొడుకు వయసుంటుందని, కానీ, తాను సొంత టాలెంట్‌తో ఎదిగిన ఒంటరి మహిళనని, తన గురించి ఉద్ధవ్ థాకరే మాట్లాడిన తీరు చూస్తోంటే సిగ్గేస్తోందని చెప్పింది.
ఉద్ధవ్ థాకరేలా తాను తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదని చెప్పింది. తాను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్నని చెప్పారు. అయితే, తాను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని, కానీ, తాను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదని చెప్పింది. కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుందని చెప్పింది.