'కేజీఎఫ్ 2'  : రవీనా దర్పం చూశారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 10:08 AM GMT
కేజీఎఫ్ 2  : రవీనా దర్పం చూశారా?

యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. 2018లో ఘన విజయం సాధించిన కేజీఎఫ్ సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. అంతా సవ్యంగా సాగితే ఈ పాన్ ఇండియా మూవీ ఈపాటికే రిలీజ్ కావాల్సినది. తొలి నుంచి కోర్టు గొడవలు.. చివరిలో మహమ్మారీ తలనొప్పి వాయిదాలకు కారణమైంది. 2021 సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఈ మూవీ నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారట.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇంతకుముందు రిలీజైన రాక్ స్టార్ యష్ లుక్ అలాగే అధీరాగా సంజయ్ దత్ లుక్ లు వైర‌ల్ అయ్యాయి. తాజాగా 'కేజీఎఫ్ 2' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రవీనా టాండర్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రవీనా..రమికా సేన్ పాత్రలో నటిస్తోంది. ఈ లుక్ లో ఎర్రటి చీర ధరించి చట్టసభల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

“రాయబడిన దారుణం !!! # KGFChapter2 నుండి #RamikaSen లుక్ ఇది. మంచి బహుమతి ఇచ్చినందుకు KGF బృందానికి ధన్యవాదాలు” అంటూ రవీనా ఎమోషనల్ అయ్యింది. మెరూన్ చీరలో అధికారం దర్పం ప్రదర్శిస్తున్న మహిళా శక్తిగా తనని ఆవిష్కరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధీరాకు ధీటుగా ఈ లుక్ ఉందంటూ ప్రశంసలు కురిపించేస్తున్నారు రవీనా అభిమానులు.

రాకీ భాయ్ స్టోరి. అతను పేదరికం నుండి ఎగసిన శిఖరం. బంగారు గనికి రాజు అవుతాడు.. ఆ క్రమంలోనే మాఫియాతో పోరాటం ఏంటనేది పార్ట్ 2లో చూపించనున్నారు. సంజయ దత్ క్యాన్సర్ ను జయించి నవంబర్ లో సెట్స్ లో జాయిన్ అవుతున్నారు. యష్- ప్రకాష్ రాజ్ - మాలవికా అవినాష్ ఆగస్టులో చిత్రీకరణలో పాల్గొన్నారు. కరోనావైరస్-ప్రేరిత దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మార్చిలో సినిమా నిర్మాణం ప్రభావితమైనా చిత్రబృందం ఆగస్టులో డేర్ చేసి తిరిగి చిత్రీకరణ ప్రారంభించింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కూడా నటించారు. చాప్టర్ 1 సాధించిన విజయంతో పెరిగిన అంచనాలకు ధీటుగా దర్శక నిర్మాతలు 'కేజీఎఫ్ ' చాప్టర్ 2ను రాజీ లేకుండా నిర్మిస్తున్నారు.

Next Story