భారీగా తగ్గిన జిఎస్టీ ఆదాయం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 8:44 AM GMT
భారీగా తగ్గిన జిఎస్టీ ఆదాయం..!

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జిఎస్టీ) ఆదాయం జులై నెలలో భారీగా తగ్గింది. ఈ ఏడాది జులై నెలలో 87422 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి అందింది. గత ఏడాది జులై నెలలో 1,02,082 కోట్లు ప్రభుత్వానికి అందింది. జూన్ నెలలో 90,917 కోట్లు రాగా ఈ నెలలో మరింత తగ్గింది.

కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్ డౌన్ కారణంగా వ్యాపారాల్లో చాలా మార్పులు వచ్చాయి. దీని వలనే జిఎస్టీ బాగా తగ్గినట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ నెలలో 1,13,865 కోట్లు రాగా.. ఈ ఏడాది కేవలం 32వేల 172 కోట్లు మాత్రమే వచ్చిందంటే భారత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మే నెలలో 1,00,289 కోట్లు వస్తే ఈ ఏడాది 62వేల కోట్లకు పడిపోయింది.

5 కోట్ల టర్నొవర్ లోపు ఉన్న వ్యాపార సంస్థలకు సెప్టెంబర్ వరకు రిటర్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఇవ్వడంతో తగ్గినట్టు చెబుతున్నారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ పన్నులు 32.6 శాతం మేర క్షీణించింది. 1999 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఓ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో ఇదే అత్యంత దారుణమైన ఆర్థిక లోటు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వార్షిక లక్ష్యంలో ఆర్థిక లోటు 83.2 శాతానికి చేరుకుంది. రెవెన్యూ తగ్గుదలలో సెంట్రల్ జిఎస్టీపై గరిష్టంగా 53 శాతం దెబ్బపడింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 40 శాతం మేర క్షీణించవచ్చునని అంచనాలున్నాయి. ఫస్ట్ క్వార్టర్ జీడీపీ అంచనాలు ఆగస్ట్ 31వ తేదీన విడుదల కానున్నాయి. ఉద్యోగాల కోత, వేతనాల కోత నేపథ్యంలో ఇన్‌కం ట్యాక్స్ కలెక్షన్లు 36 శాతం తగ్గాయి.

Next Story