భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 54,736కేసులు.. 853 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 5:35 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24గంటల్లో 54,736కేసులు.. 853 మంది మృతి

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 17లక్షలను దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 54,736 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,50,724కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 11,45,630కి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 5,67,730 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్క రోజే 853 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 37,364కి చేరింది. దేశ వ్యాపంగా రికవరీ రేటు 65.44శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,98,21,831 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 1.54లక్షల మంది, బ్రెజిల్‌లో 93వేల మంది, మెక్సికోలో 47వేల మంది, బ్రిటన్‌లో 46 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story