తెలంగాణలో 5,000 ఉద్యోగాలు
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిశారు
By Medi Samrat Published on 28 Sept 2024 12:33 PM ISTహెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిశారు. హెచ్‌ఐటిఇసి సిటీలో హెచ్‌సిఎల్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. కొత్త కార్యాలయం అదనంగా 5,000 ఇంజినీరింగ్ ఉద్యోగాలను అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మరింత దోహదపడుతుందని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని తెలిపారు రోషిణి.
శిక్షణ కార్యక్రమాలను మెరుగుపరచడానికి, విద్యా వనరులను విస్తరించడానికి HCL, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ మధ్య భాగస్వామ్యం ఉంది. తెలంగాణలో హెచ్‌సిఎల్‌కు నిరంతర మద్దతు ఇవ్వడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోషిణి నాడార్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి అవకాశాల కల్పనలో కంపెనీ గణనీయమైన కృషిని రేవంత్ రెడ్డి అభినందించారు . హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, తెలంగాణ ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్ర ఉపాధి అవకాశాలు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన వృద్ధి,సరికొత్త ఆవిష్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామని రోషిణి నాడార్ తెలిపారు.