సీతాదేవిని బూతులు తిడుతూ.. యూట్యూబ్ లో వీడియో పెట్టిన యువతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Aug 2020 6:53 AM GMTఆగష్టు 5వ తేదీ బ్లాక్ డే అంటూ ఆగష్టు 23న యూట్యూబ్ లో హీర్ ఖాన్ అనే మహిళ వీడియోను పోస్టు చేసింది. అందులో సీతా దేవిని, హిందూ దేవుళ్లను, దేవతలను బూతులు తిట్టడం మొదలైంది.
రాయడానికి కూడా వీలు కాని బూతులను హిందూ దేవతలను తిట్టింది సదరు మహిళ. రాముడిని, అయోధ్యపై కూడా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ఇస్లాం గురించి బూతులు తిట్టడం మొదలుపెడితే.. ముస్లింలు చూస్తూ ఉండరని.. ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చింది.
హిందూ దేవతలు, సీతమ్మ మీద మరీ నీచాతి నీచమైన కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ మొదలైంది. #ArrestHeerKhan అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఆమె ఉంటున్న లొకేషన్, వివరాలను కోరుతూ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన సదరు పోస్టుకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సందీప్ మిట్టల్ స్పందించారు. యూపీ పోలీసులు ఆమె చేసిన వ్యాఖ్యలపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్ కు సూచనలు చేశారు.
ఆగష్టు 24న ఆమె మరో వీడియోను కూడా పోస్టు చేసింది. గత రెండేళ్లుగా హిందూ దేవతల మీద ఆమె ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ వ్యాఖ్యలు చేస్తున్నా.. ఏ ఒక్కరు కూడా ఆమె మీద చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎవరైనా ఆమె గురించి, ఇస్లాం గురించి తిడుతూ వ్యాఖ్యలు చేస్తే వారి కుటుంబాన్ని రేప్ చేస్తామంటూ బెదిరింపులకు దిగింది. మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే బెంగళూరు తరహా ఘటనలు జరుగుతాయని చెప్పుకొచ్చింది.
ఆమె జనవరి 4, 2020న వీడియోను అప్లోడ్ చేసింది. తన గత యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయ్యిందంటూ అందులో చెప్పుకొచ్చింది. భారత్ లో ఎన్నో మారణహోమాలకు కారణమైన పాకిస్థానీ టెర్రరిస్ట్ మసూద్ అజర్ మీద ప్రేమ కురిపిస్తూ కూడా వీడియోను పోస్టు చేసింది. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఇంకా కనుక్కోవాల్సి ఉంది.