భారత్, రష్యాను కోల్పోయాం : ట్రంప్
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఎస్ సీఓ సదస్సు తర్వాత ట్రంప్ వైఖరి కాస్త మెతకగా కనిపిస్తోంది. తాజాగా ట్రంప్.. మేము భారతదేశాన్ని, రష్యాను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. మీకు సుదీర్ఘమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కలిగి ఉండాలి.. అధ్యక్షుడు డొనాల్డ్ J. ట్రంప్ అంటూ పోస్టులో రాశాడు.
ట్రంప్ ఈ సోషల్ మీడియా పోస్ట్‌లో అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియా ట్రూత్‌లో వీరంతా ఉన్న చిత్రంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు. చిత్రంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.