ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా ప‌ర్య‌ట‌న‌కు జైశంకర్

రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భార‌త‌ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు.

By Medi Samrat
Published on : 13 Aug 2025 4:25 PM IST

ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా ప‌ర్య‌ట‌న‌కు జైశంకర్

రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భార‌త‌ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా రష్యాలో పర్యటించి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సమాచారం ఇస్తూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ.. ఆగస్టు 21న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మాస్కోలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో చర్చలు జరుపుతారని వెల్ల‌డించింది.

ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా గత వారం రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. ఈ సమయంలో ఆయన అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశారు. దీంతో పాటు రష్యా భద్రతా మండలి సెక్రటరీ సెర్గీ షోయిగుతో కూడా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా ఇంధనం, రక్షణ సంబంధాలపై చర్చించారు. ఇది కాకుండా.. ఈ ఏడాది చివరి నాటికి రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని అజిత్‌ దోవల్ ధృవీకరించారు.

Next Story