ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టును చూసి వణికిపోతున్న పాకిస్థాన్
Pakistani Army has been put on high alert fearing an attack by India. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పాకిస్థాన్ తీవ్రవాద చర్య
By Medi Samrat Published on 10 Dec 2020 1:40 PM ISTప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పాకిస్థాన్ తీవ్రవాద చర్యలను ఏ మాత్రం సహించడం లేదు. భారత ఆర్మీ మీద దాడి జరిగినా, భారత్ లో ఎటువంటి ఉగ్ర దాడులు చోటు చేసుకున్నా పాకిస్థాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందని వారి మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది.
ప్రస్తుతం భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై దాడులు జరుపుతుందనే భయాలు పాక్ లో ఉన్నాయట. తాజాగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఒక కీలక నివేదికను ఆ దేశ ప్రభుత్వానికి అందించింది. రైతు ఆందోళనల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని నివేదికలో ఉందట..! అంతే మొత్తం షాక్ అయ్యారు. భారత సైన్యం విరుచుకుపడే అవకాశం ఉందని తెలపడంతో సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేయాలని సూచించింది. ఈ మేరకు పాక్ లోని ప్రముఖ పత్రిక ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ లో కథనాలు వచ్చాయి.
భారత్ లోని నిరసనలను బలహీనపరిచేందుకు హిందుత్వవాది అయిన మోదీ ఏమైనా చేయడానికి సిద్ధపడతారని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. రైతుల ఉద్యమం మరో ఖలిస్థాన్ ఉద్యమంలా మారేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోదని.. భారత్ ఎలాంటి దాడులకు యత్నించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని పాక్ మీడియా చెబుతోంది. భారత్ లోని సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని ఆ దేశ మీడియా కథనాలను వండివార్చుతోంది.
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. భారత్ బంద్ ను కూడా చేపట్టారు. రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఇప్పటికే రైతు ఆందోళనలకు కెనడా ప్రధాని ట్రూడో మద్దతు పలికారు. ఇలాంటి సమయంలో దృష్టి మరల్చడానికి పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్ ను భారత్ చేపడుతుందని పాక్ భావిస్తోంది.